Posts

Showing posts from 2023

సీతాకోకచిలుక...

ఓ  బంగారు రంగుల సీతాకోకచిలుక... ఈ వేసవిలో తొలకరి జల్లులు కురిసిన వేళ నా మది నీ జ్ఞాపకాలతో పులకరించిన వేళ అమోఘం అద్భుతం ఉదయాన్నే ఉషోదయ సూర్యుడి కాంతిని చూస్తే  నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ మొహంలా మెరిసిపోతు ఉంది. కాకమ్మలు కావు కావు రాగాలు వింటుంటే కోపంతో నువ్వు నన్ను కసిరిన రోజులు జ్ఞాపకం ఉన్నాయి. కోకిలమ్మల కుహు కుహు రాగాలతో సవ్వడి చేస్తుంటే మన ప్రేమామృత ఘడియలు గుర్తుకొస్తున్నాయి.

⛅ ఓ... మేఘమాల...⛅

  ⛅  ఓ... మేఘమాల...⛅ దగ్గరగా ఉంటావు దూరమవుతుంటావు అందంగా ఉంటావు  అందకుండా ఉంటావు అదరహో నీ అందాలు అంతుచిక్కని నీ ఊహలు నీ పైనే నా ఆశలు అడియాశలు చేయకు నా భాషలు అమావాస్య చంద్రుడు లాంటి నల్లటి కఠినత్వం పున్నమి చంద్రుడు లాంటి చల్లదనం మరుపు రానిది మన స్నేహం విడిపోకు ఎన్నడూ నేస్తం.

…ఎందుకో మా శివయ్యకి… ఒకటి తగ్గింది…

Image
                                          …ఎందుకో మా శివయ్యకి… ఒకటి తగ్గింది…                                                                సంవత్సరానికి పదుల సంఖ్యలో పండుగలు ఉన్న మా శివయ్యకు మాత్రం శివరాత్రి ఒక్కటే అందుకే మా శివయ్యకు ఒకటి తగ్గింది. అన్ని పండుగలకు ఉదయాన్నే లేచి స్నానమాచరించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి ఒక నమస్కారం పెట్టి తండ్రి మమ్మల్ని దీవించు అని కోరిక కోరితే సరిపోతుంది. కానీ మా శివయ్య శివరాత్రి రోజు జాగారం చేయమంటాడు. శివయ్య జాగారం చేయమంటే మాకు లేనిపోని అలసట వస్తుంది అదే మిగతా రోజుల్లో అయితే చరవాణి చేతిలో పట్టుకొని రాత్రి 12 దాకా ఉంటాం, కానీ నిద్ర రాదు. బహుశా జీవితంలో ఒక్క శివరాత్రి శివయ్యకు దగ్గరగా జరుపుకోవాలని నాకు రాసి పెట్టలేదేమో. ఈ కలియుగంలో ఫ్యాషన్ ,టెక్నాలజీ ,ఒకరితో ఒకరికి సంబంధంలేని మానవ జీవితాలు, బండ రాళ్లను పగలగొట్టి ఆ కాంక్రీట్ తో చేసిన నివాసాలలో నివసించి గుండెలు కూడా బండరాళ్లయ్యాయి శివ. అందుకే దైవ భక్తి చింతనలో మేము వెనుకబడ్డాము తండ్రి.  ఆ దైవభక్తి  ఒక్కటి శివయ్యకు తగ్గింది.  మేము ఎంత మూర్ఖులం అంటే తండ్రి ఒంటి నిండా నగలు ధరించి కొత్త పుంతలతో తయారవుత